అసోంలో కంపించిన భూమి- దృశ్యాలు వైరల్ - గువహటి భూకంపం
అసోంలో భూకంపం సంభవించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతకు అనేక పట్టణాల్లో భవంతులు బీటలువారాయి. గువాహటిలో ఓ ఇంటిపై మరో ఇల్లు పూర్తిగా ఒరిగిపోయింది. కొన్ని చోట్ల పిల్లర్లు, గోడలు దెబ్బతిన్నాయి. దీంతో ఇంటిపైన ఉండే ట్యాంకులు ధ్వంసమై భవంతిలోకి నీళ్లు చేరాయి. రోడ్లు మధ్యకు చీలిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోలు వైరల్గా మారాయి.