పుణెలో డ్రైవర్లెస్ బైక్.. వీడియో వైరల్! - పుణె బైక్ వీడియో వైరల్
డ్రైవర్లెస్ కార్ల గురించి అందరికీ తెలిసిందే. మరి డ్రైవర్లెస్ బైక్ గురించి విన్నారా? ఇదేదో కొత్త టెక్నాలజీ అని అనుకోకండి. అదుపు తప్పిన ఓ బైక్ రోడ్డు మీద సుమారు 300 మీటర్ల వరకు దూసుకెళ్లింది. దాని మీద వాహనదారుడు ఎవరూ లేకపోవడం గమనార్హం. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణె జిల్లా నారాయణగావ్లో సోమవారం సాయంత్రం జరిగింది. స్థానిక పెట్రోల్ పంప్ వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డు అయిన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.