సర్కార్ నిబంధనతో ఉదయమే టపాసుల మోత...! - diwali patas
ఉదయమే బాంబుల మోతతో ఉలిక్కిపడి నిద్ర లేచారు కొందరు చెన్నై వాసులు. కళ్లు నులుముతూ ఏమిటా అని ఆందోళనగా చూశారు. ఏముందీ ఓ కుర్రముఠా దీపావళి టపాసులు పేలుస్తూ కనిపించింది. అప్పుడు గుర్తుకొచ్చింది వారికి రాష్ట్ర ప్రభుత్వ నిబంధన. కాలుష్య నియంత్రణ లక్ష్యంతో ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య, సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య మాత్రమే టపాసులు పేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉదయమే పటాసులు పేల్చారు చెన్నై వాసులు. కోయంబత్తూర్లోనూ పటాసుల పేల్చారు.