ఆందోళనకారులకు అరటిపండ్లు, అల్పాహారంతో ఆతిథ్యం..! - news on Citizenship Act
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీ గురువారం.. రణరంగంగా మారిన వేళ నిరసనకారులను శాంతింపజేసేందుకు వినూత్న ప్రయత్నాలు చేశారు దిల్లీ పోలీసులు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని సురాజ్మాల్ స్టేడియంలోకి తరలించారు. అక్కడ వారికి అరటి పండ్లు ఇస్తూ.. పౌరచట్టంపై పూర్తి అవగాహన కల్పించేందుకు కృషి చేశారు పోలీసులు. ఇదే విధంగా బవానాలోని రాజీవ్ గాంధీ స్టేడియంలోనూ ఆందోళనకారులకు అల్పాహారం అందించి.. అవగాహన కల్పించారు.