తెలంగాణ

telangana

ETV Bharat / videos

విరిగిన వంతెన పైనుంచే రాకపోకలు! - భారీ వర్షాలు ఉత్తరాఖండ్

By

Published : Jul 13, 2021, 6:33 PM IST

నైరుతి రుతుప‌వ‌నాల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేని వానలకు న‌దులు, నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లేందుకు ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోంది. ఉత్తరాఖండ్‌లో కురిసిన భారీ వ‌ర్షాల‌కు అమ్లావా న‌ది ఉప్పొంగి ప్రవ‌హిస్తోంది. దెహ్రాదూన్ జిల్లాలో ఆ న‌దిపై నిర్మించిన ఓ తాత్కాలిక వంతెన ఒక‌ వైపు నుంచి విరిగిపోయి న‌దిలో ప‌డింది. అయినా జ‌నం ఆ విరిగిన బ్రిడ్జిని ఆస‌రాగా చేసుకుని ప్రమాద‌క‌ర రీతిలో న‌దిని దాటుతున్నారు. ప్రాణాలను ప‌ణంగా పెట్టి జ‌నం న‌దిని దాటుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details