కొవిడ్ వార్డులో నర్సు స్టెప్పులు.. వీడియో వైరల్ - బంగాల్ వార్తలు
కోల్‌కతాలోని ఉడ్‌ల్యాండ్స్ ఆస్పత్రి కొవిడ్ వార్డులో ఓ నర్సు అదిరేటి స్టెప్పులేశారు. పీపీఈ కిట్ ధరించిన అజిత్ కుమార్ పట్నాయక్.. తీన్మార్ డ్యాన్స్‌తో వార్డులోని రోగులను అలరించారు. తనతోపాటు తోటి సిబ్బందితోనూ స్టెప్పులేయించారు. వీరి డ్యాన్స్‌ను చూసి వార్డులోని రోగులంతా చప్పట్లు కొడుతూ అభినందించారు. కరోనా బాధితుల్లో ఒత్తిడి దూరం చేసేందుకు ఆ నర్సు చేసిన ఈ డ్యాన్స్ వీడియోలు.. సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యాయి.