రథయాత్ర: అహ్మదాబాద్లో భక్తుల కిటకిట - గుజరాత్
గుజరాత్లోని అహ్మదాబాద్లో జగన్నాథుడి రథయాత్ర కన్నుల పండుగగా సాగుతోంది. ఆలయం వద్ద ఉదయం నుంచే భక్తుల సందడి నెలకొంది. యాత్రలో వేల మంది ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంగారు చీపురుతో ఆలయ ప్రాంగణాన్ని ఊడ్చారు.