కార్మికుల కుటుంబాలతో కిక్కిరిసిన ధారావి రోడ్లు - ధారావి రోడ్లు
దేశంలో కరోనాకు హాట్‌స్పాట్‌గా మారిన ముంబయి- ధారావిలో భారీ సంఖ్యలో కార్మికులు రోడ్లపైకి తరలివచ్చారు. లాక్డౌన్ కారణంగా రెండున్నర నెలలుగా అక్కడే చిక్కుకున్న వలస కార్మికులు.. తమ సొంత గ్రామాలకు చేరుకునేందుకు పయనమయ్యారు. భౌతిక దూరం నిబంధనలకు తూట్లు పొడుస్తూ.. కూలీలంతా తమ కుటుంబాలతో ఒక్కసారిగా రోడ్డెక్కారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. తక్షణమే అక్కడికి చేరుకొని క్యూ పద్ధతి పాటించేలా చర్యలు చేపట్టారు.