రూటు మార్చిన దొంగలు- హెల్మెట్ ధరించి దోపిడీలు! - రాంచీ దొంగతనం వార్తలు
ఝార్ఖండ్ రాంచీలో దొంగలు రెచ్చిపోయారు. మెక్‌క్లూసిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కొరియర్ కంపెనీ కార్యాలయంలోకి హెల్మెట్ ధరించి చొరబడిన నలుగురు దుండగులు.. అందులోని ఉద్యోగులను తుపాకీతో బెదిరించి సుమారు రూ.3లక్షలు దోచుకెళ్లారు. ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ కేసులో పోలీసులు ఒక్కరిని అరెస్టు చేశారు.