ఎరుపు రంగు చూసి ఆవు బీభత్సం- మహిళలపై దాడి! - మహిళలను పొడిచిన ఆవు
మహారాష్ట్ర కొల్హాపూర్‌లో.. ఓ ఆవు మహిళలపై దాడి(cow attacks on humans) చేసింది. ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి ఇంటి ముందు పనిచేసుకుంటున్న ఓ మహిళపై మెుదట ఆవు దాడికి(cow attack) దిగింది. అడ్డుకునేందుకు బాధితురాలి కుటుంబ సభ్యులు యత్నించినా.. వెనక్కి దగ్గలేదు. వారిని కూడా తన కొమ్ములతో కుమ్ముతూ బీభత్సం సృష్టించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఒకే రోజు సుమారు 20 మందికిపైగా దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.