
నూతన జంటకు 'పెట్రోల్- వంటగ్యాస్' గిఫ్ట్ - నూతన జంటకు 5 లీటర్ల పెట్రోల్ బహుమతి
తమిళనాడు చెన్నైలోని మధురవోయల్లో కొత్తగా పెళ్లైన ఓ జంటకు ఊహించని బహుమతి ఇచ్చారు వారి మిత్రులు. పెట్రోల్, ఉల్లి, వంటగ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో... నూతన వధూవరులకు 5 లీటర్ల పెట్రోల్, ఉల్లి గడ్డలతో తయారు చేసిన దండ, గ్యాస్ సిలిండర్ బహుమతిగా ఇచ్చారు. ఇలాంటి ఊహించని బహుమతి ఇవ్వడం పట్ల పెళ్లికి హాజరైన వారందరూ విపరీతంగా నవ్వుకున్నారు.