విద్యార్థులతో స్టెప్పులేసి అదరగొట్టిన రాహుల్ - Gandhi doing push-ups
తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్‌గాంధీ.. తనదైన శైలిలో ఓటర్లకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యార్థులతో ఆటపాటలతో ప్రచారం కొనసాగిస్తున్నారు. కన్యాకుమారిలో పర్యటించిన ఆయన స్థానికంగా ఉండే సెయింట్ జోసెఫ్స్ మెట్రిక్యులేషన్ పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. తనకు తెలిసిన ఆత్మరక్షణవిద్య 'ఐకిడో'ను ప్రదర్శించారు. ఈ క్రమంలో ఓ విద్యార్థినితో పుష్ అప్స్లో పోటీ పడ్డారు. మధ్యలో ఒంటిచేత్తోనూ పుష్ అప్స్ తీశారు. మరో వైపు విద్యార్థినులతో కలిసి రాహుల్ చిన్న చిన్న స్టెప్పులు వేసి అక్కడి యువతను ఉత్సాహపరిచారు.
Last Updated : Mar 1, 2021, 5:15 PM IST