సముద్రంలో జవాన్‌ను కాపాడిన తీరప్రాంత దళం - Coast Guard
గోవా సముద్రంలో మునిగిపోతున్న సైనికుడిని హెలికాప్టర్ సాయంతో కాపాడింది భారత తీరప్రాంత దళం. పుణెకు చెందిన 26ఏళ్ల జవాన్ గోవాకు సేద తీరేందుకు వచ్చాడు. ప్రమాదవశాత్తు కొండపై నుంచి జారి సముద్రంలో పడిపోయాడు. అలల ధాటికి కొట్టుకుపోయాడు. బీచ్‌లో భద్రతా సేవలు అందించేవారు అతడిని చేరుకోలేక పోయారు. విషయం తెలుసుకున్న తీరప్రాంత దళం హెలికాప్టర్ సాయంతో సైనికుడిని కాపాడింది.