గిరిజన ఉత్సవాల్లో కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి అదిరే స్టెప్పులు - ధామీ డ్యాన్స్
ఉత్తరాఖండ్ రాజధాని దేహ్రాదూన్‌లోని ఓఎన్జీసీ అంబేద్కర్ మైదానంలో వైభవంగా గిరిజనోత్సవాలు నిర్వహించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జన్మదినం, రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు చేపట్టారు. పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శుక్రవారం హాజరైన కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ.. కళాకారులతో నృత్యాలు చేశారు. తమతో పాటు సీఎం డ్యాన్స్ చేయటంపై సంతోషం వ్యక్తం చేశారు జానపద కళాకారులు.