ప్లాట్‌ఫాంపై కుప్పకూలిన వ్యక్తి- కాపాడిన కానిస్టేబుల్ - సీఐఎస్ఎఫ్
అనిల్గుంజా అనే సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఓ వ్యక్తికి ప్రాణం పోశారు. దిల్లీలోని ద్వారకా నుంచి నోయిడా వెళుతున్న మెట్రో రైలు ఇంద్రప్రస్థ స్టేషన్లో ఆగింది. అందులోనుంచి జావేద్ అలీ అనే వ్యక్తి దిగాడు. ప్లాట్‌ఫాంపై దిగిన కాసేపటికే కుప్పకూలిపోయాడు. సీసీటీటీలో గమనించిన అనిల్ గుంజా అధికారులతో సహా ఘటన ప్రదేశానికి వచ్చిచూసేసరికి అతను చలనం లేకుండా ఉన్నాడు. వెంటనే జావేద్‌కు గుండెపై 'సీపీఆర్' చేసి అతనికి ఊపిరిపోశారు. తదనంతరం చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు. సంబంధిత వీడియో వైరల్ అవుతోంది. ప్రస్తుతం జావేద్ పరిస్థితి బాగున్నట్లు వైద్యులు తెలిపారు. తనను రక్షించిన పోలీసులకు జావేద్ ధన్యవాదాలు తెలిపాడు.
Last Updated : Feb 20, 2021, 3:42 PM IST