'గల్వాన్ను ఆక్రమించుకోవాలన్నదే చైనా ప్లాన్' - గల్వాన్ వద్ద మోహరించిన చైనా సైన్యం
తూర్పు లద్దాక్ గల్వాన్ లోయలోని పెట్రోల్ పాయింట్ 14 సమీపంలో... చైనా బలగాలు మోహరించి ఉన్నాయని లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) బీఎస్ జైస్వాల్ పేర్కొన్నారు. జూన్ 15న భారత దళాలపై జరిగిన దాడికి... ఇంటెలిజెన్స్ వైఫల్యం కారణమై ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే నిజానికి ఏమి జరిగిందో భారత రక్షణ మంత్రిత్వశాఖకు తెలుసుని ఆయన పేర్కొన్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు గురించి ఇప్పటికీ సరైన మ్యాప్ లేదని, అందువల్ల చైనా... అక్రమంగా భారత్కు చెందిన ప్రాంతాలను ఆక్రమించుకోవాలని చూస్తోందని ఆయన ఈటీవీ భారత్ ముఖాముఖిలో వివరించారు.