లైవ్ వీడియో: టైరు కింద పడ్డ వ్యక్తిని ఈడ్చుకెళ్లిన కారు - రాయ్‌పుర్‌లో రోడ్డు ప్రమాదం
ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్‌పుర్ నగరంలో విచక్షణా రహితంగా కారు నడుపుకుంటూ వచ్చిన చోదకుడు బైక్‌ను ఢీకొట్టాడు. ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు కారు టైరు కింద పడ్డాడు. ఆ వ్యక్తిని కొంత దూరంమేర కారుతో పాటు ఈడ్చుకెళ్లాడు డ్రైవర్. ఈ ఘటన తాలూకు దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ద్విచక్రవాహన చోదకుడికి స్వల్ప గాయాలు కాగా... టైరు కింద పడ్డ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇరువురుని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.