శంకర్ మహదేవన్ పాటకు సీఎం డ్యాన్స్- వీడియో వైరల్ - ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ డాన్స్ వీడియో
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ డాన్స్‌తో అలరించారు. ఛాంద్‌ఖురైలోని మాతా కౌసల్య దేవి దేవాలయం ప్రారంభోత్సవానికి సీఎం బఘేల్ వెళ్లారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత కచేరీలో ప్రఖ్యాత గాయకుడు శంకర్ మహదేవన్ పాడిన పాటకు ముఖ్యమంత్రి నృత్యంతో ఆకట్టుకున్నారు. పార్టీ నేతలు కూడా బఘేల్‌తో కలిసి స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.