చైన్ కోసం ఎంతకు తెగించారో చూడండి... - delhi
దిల్లీ ఇంద్రపురిలో గొలుసు దొంగలు రెచ్చిపోయారు. ఒంటరిగా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళపై విచక్షణారహితంగా దాడి చేశారు. మెడలోని గొలుసు లాక్కునేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించగా... తీవ్రంగా గాయపరిచారు. చుట్టుపక్కల వారు వచ్చే లోపే గొలుసు లాక్కుని క్షణాల్లో బైక్పై పరారయ్యారు. బుధవారం జరిగిన ఈ ఘటన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.