వైరల్: కేకును తుపాకీతో పేల్చి బర్త్డే సంబరాలు
పుట్టినరోజు వేడుకల్లో ఎవరైనా కేకును కత్తితో కోస్తారు. కానీ ఉత్తర్ప్రదేశ్ బాగ్పత్ నగరానికి చెందిన కొందరు యువకులు కొత్తగా ఆలోచించి చిక్కుల్లో పడ్డారు. తుపాకీతో కేకును పేల్చి పుట్టిన రోజు సంబరాలు జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వీడియోను పరిశీలించిన పోలీసులు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.