బంక్‌లోకి దూసుకొచ్చిన కారు- ఒకరు మృతి - road accident in haryana
హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. భడ్కల్ చౌక్ పెట్రోల్ బంక్ వద్ద కూర్చున్న ముగ్గురు వ్యక్తులపైకి మితిమీరిన వేగంతో దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రమాదం తర్వాత కారు డ్రైవర్ పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.