Live Video: నడిరోడ్డుపైనే వ్యక్తి దారుణ హత్య - బెంగళూరు లైవ్ మర్డర్
నడిరోడ్డుపైనే ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు కొందరు దుండగులు. ఈ ఘటన కర్ణాటక బెంగళూరులో జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం బనశంకరి మెట్రో పిల్లర్ వద్ద పార్క్ చేసి ఉన్న తన కారు వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి కారు ఎక్కబోతుండగానే.. బైక్పై వచ్చిన ఆరుగురు దుండగులు కత్తులతో నరికి చంపేశారు. ఈ ఘటన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. బాధితుడిని లక్కసంద్రకు చెందిన మదన్గా పోలీసులు గుర్తించారు. పాతకక్షల కారణంగా వ్యక్తిని హత్యచేసినట్లు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.