'గో సంరక్షణ' పేరుతో మరో మూకదాడి - గోవులు
మధ్యప్రదేశ్ ఖండ్వా జిల్లాలోని ఖాల్వాలో గోవులను తరలిస్తున్నారన్న ఆరోపణలతో 25 మందిని బంధించి వారిపై దాడి చేశారు గ్రామస్థులు. 8 వాహనాల్లో ఆవులను తరలిస్తూ స్థానికుల చేతికి చిక్కిన ముఠాను తాళ్లతో బంధించి 'గోమాతకు జై' నినాదాలు పలికించారు. అలాగే ప్రదర్శనగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. గోవులను తరలించేవారితోపాటు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, దాడి చేసిన కారణంగా గ్రామస్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు.