పార్టీ టికెట్ ఇవ్వలేదని.. బోరున విలపించిన కార్యకర్త - bsp latest news
BSP Leader Crying: ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ ఓ బీఎస్పీ కార్యకర్త బోరున విలపించారు. పార్టీ కోసం 24 ఏళ్లుగా కష్టపడ్డా.. చివరి నిమిషంలో తనకు టికెట్ దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు అర్షద్ రాణా. పార్టీ కోసం హోర్డింగ్లు కూడా కట్టానని.. ఇప్పుడు ఇలా చేయడం సరికాదని అన్నారు. ముజఫుర్నగర్ బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు సతీశ్ కుమార్ను కలిస్తే.. రూ. 50 లక్షలు ఏర్పాటు చేయాలని అడిగినట్లు ఆరోపించారు రాణా. ఇప్పటికే రూ. 4.5 లక్షలు ఇచ్చానని చెప్పారు. రాణా విలపించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.