Birds Walk Festival: పర్యాటకులను ఆకట్టుకుంటున్న పిట్టల నడక - బర్డ్స్ వాక్ ఫెస్టివల్ వార్తలు
కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ అడవుల్లో ప్రారంభమైన బర్డ్స్ వాక్ ఫెస్టివల్‌కు విశేష స్పందన లభిస్తోంది. పర్యాటకులు రకరకాల పక్షుల కూతన నడుమ ప్రకృతిని ఆస్వాదిస్తూ పరవశించిపోతున్నారు. 2019 డిసెంబర్‌లో తొలిసారి బర్డ్స్ వాక్‌ను నిర్వహించిన అధికారులు.. ప్రకృతి ప్రేమికుల విశేష స్పందనతో యేటా కొనసాగిస్తున్నారు. వివిధ రకాల పక్షులు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.