భారీ అలలు.. అంతా చూస్తుండగానే మునిగిన పడవ - boat capsized report
గంగానదిలో ఇసుక లోడ్‌తో వెళ్తున్న ఓ పడవ మునిగింది. భారీ అలల ధాటికి అతలాకుతలమైన బోటు.. ఒక్కసారిగా అందరూ చూస్తుండగానే మునిగిపోయింది. దీంతో పడవలోని నావికులు, సిబ్బంది నదిలోకి దూకి ఈత కొట్టుకుంటూ వేరొక పడవలోకి వచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటన బిహార్ ఛప్రా జిల్లాలో జరిగింది.