'పౌర' సెగ: అసోంలో భాజపా కార్యాలయం ధ్వంసం - 'పౌర' సెగ: అసోంలో భాజపా కార్యాలయం ధ్వంసం
పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా అసోంలో జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ సొంత నియోజకవర్గం మజూలీలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. వందల మంది కలిసి భాజపా కార్యాలయంపై దాడికి దిగారు. సామగ్రిని ధ్వంసం చేశారు. కేంద్రానికి, భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.