'కాంగ్రెస్ సలహాలను కేంద్రం పరిగణించాల్సిందే' - వ్యవసాయ చట్టాల రద్దు
దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి కేంద్రం కాంగ్రెస్ పార్టీ సలహాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్. ఆర్థిక సంస్కరణల విషయంలో తమ పార్టీని తప్పక సంప్రదించాలని భాజపాకు సూచించారు. పంజాబ్ కాంగ్రెస్ ఇంఛార్జిగా కూడా ఉన్న రావత్.. ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. భాజపా తన మొండి వైఖరిని విడనాడి.. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.