తెలంగాణ

telangana

ETV Bharat / videos

'తమిళనాడు, కేరళలో భాజపాదే విజయం' - పొల్సాని మురలిధర్​ రావు

By

Published : Mar 5, 2021, 3:04 PM IST

దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది భాజపా. ఈ క్రమంలో ఈ ఏడాది తొలినాళ్లలో జరిగిన గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ (జీహెచ్​ఎంసీ) ఎన్నికల్లో భాజపా అనూహ్యంగా పుంజుకుని భారీగా సీట్లు సాధించింది. అదే ఊపుతో తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తోంది. శాసనసభ ఎన్నికలపై మధ్యప్రదేశ్​ భాజపా ఇన్​ఛార్జి మురళీధర్​ రావు.. ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు. 'దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని భాజపా గట్టి సంకల్పంతో ఉంది. కర్ణాటకలో అధికారం చేపట్టిన తర్వాత.. ఇతర దక్షిణ రాష్ట్రాల్లో తన ఉనికి చాటుకుంటోంది. కేరళలో విజయం సాధించటం కష్టమైనా, అసాధ్యమేమీ కాదు. ఇప్పటికే తమిళనాడులో తమ కూటమి అధికారంలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో విజయం మాదే' అని ధీమా వ్యక్తం చేశారు మురళీధర్​ రావు.

ABOUT THE AUTHOR

...view details