ఎన్సీపీ కార్యకర్తపై భాజపా శ్రేణుల దాడి - madhypradesh
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఎన్సీపీ కార్యకర్తపై భాజపా మద్దతుదారులు దాడికి తెగబడ్డారు. భోపాల్ లోక్సభ భాజపా అభ్యర్థి సాధ్వీ ప్రజ్ఞా సింగ్ రోడ్ షోకు నిరసనగా నల్లజెండాలు ప్రదర్శించటమే దాడికి కారణమని తెలుస్తోంది. జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో నుంచి ఈడ్చుకుంటూ పిడిగుద్దులు కురిపించారు భాజపా కార్యకర్తలు. పోలీసులు జోక్యం చేసుకుని శాంతింపజేశారు.