భాజపా-కాంగ్రెస్ కార్యకర్తల బాహాబాహీ - గుజరాత్లో కాంగ్రెస్-భాజపా ప్రచారం
గుజరాత్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా.. భాజపా-కాంగ్రెస్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రచారానికి చివరి రోజైన శుక్రవారం.. వడోదరాలోని తలావ్ ప్రాంతంలో ప్రధాన పార్టీలు ఎన్నికల ర్యాలీ నిర్వహించాయి. ఈ సమయంలో ఎదురుపడ్డ భాజపా-కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగారు. అసభ్య పదజాలంతో దూషించుకుంటూ.. రాళ్లు విసురుతూ, పిడిగుద్దులు కురిపించుకున్నారు. కర్రలతో దాడి చేసుకుంటున్న వీరిని నిలువరించేందుకు ఇరుపార్టీల ముఖ్యనేతలు కష్టపడాల్సి వచ్చింది.
Last Updated : Feb 19, 2021, 8:21 PM IST