బస్సు దిగుతుండగా బైక్ ఢీకొట్టి ఎగిరిపడ్డ కండక్టర్ - బెంగళూరు యాక్సిడెంట్
బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయనగర ప్రాంతంలో బస్సుదిగిన ఓ కండక్టర్ను ఢీకొట్టాడు ఓ ద్విచక్రవాహనదారుడు. జులైన 7న జరిగిన ఈ ఘటనలో.. వాహనం ఢీకొట్టగానే కండక్టర్ ఎగిరిపడి స్పృహ కోల్పోయాడు. ప్రస్తుతం కండక్టర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.