వైరల్: గంగా నది వరదలకు కుప్పకూలిన మసీదు - bihar ganga river floods news
ఉత్తర బిహార్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కటిహార్ జిల్లాలో గంగానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. బబలాబన్న గ్రామంలో వరదల ధాటికి ఓ మసీదు కుప్పకూలింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. వరదల కారణంగా తమ పంటపొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయని కటిహార్ జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.