టీకా కేంద్రం వద్ద కర్రలతో కొట్టుకున్న జనం - బిహార్ అరారియాలో వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద ఘర్షణ
బిహార్ అరారియా జిల్లాలోని ఓ వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఫారబిస్‌గంజ్ సబ్‌డివిజన్‌లోని ఓ గ్రామంలో వ్యాక్సిన్ కోసం టీకా కేంద్రానికి వెళ్లిన గ్రామస్థులు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఒకరినొకరు తోసుకుంటూ పరస్పర దాడులకు దిగారు. ఈ క్రమంలో గ్రామస్థులకు కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గ్రామంలో కొందరు పుట్టించిన పుకార్ల కారణంగానే టీకా కేంద్రం వద్ద గొడవ జరిగినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. టీకా తీసుకుంటేనే ప్రభుత్వ ఫలాలు అందుతాయనే ప్రచారం గ్రామంలో విపరీతంగా జరగటం వల్ల.. గ్రామస్థులు టీకా కేంద్రానికి పొటెత్తారు. క్యూ పద్దతి పాటించకుండా కొందరు వ్యక్తులు టీకా పొందేందుకు ప్రయత్నించడం వల్ల వివాదం చెలరేగినట్లు వైద్యాధికారి రాజీవ్ భాస్కర్ తెలిపారు.