పోలీస్ స్టేషన్లో రౌడీ బర్త్‌డే వేడుకలు- వీడియో వైరల్ - భోపాల్ న్యూస్
పోలీస్ స్టేషన్లోనే ఓ రౌడీ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఆ ఠాణా ఇంఛార్జ్. ఈ సంఘటన మధ్యప్రదేశ్ భోపాల్ టీటీ నగర్ పోలీస్ స్టేషన్లో జరిగింది. మూడు రోజుల క్రితం.. రౌడీషీటర్ గోవింద్ అలియాస్ లక్కీ జన్మదిన వేడుకలు అర్ధరాత్రి డీజేలతో జరుపుకొన్నాడు. తమకు ఇబ్బంది కలిగిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేయగా.. అక్కడికి వెళ్లిన పోలీసు అధికారి శైలేంద్ర శర్మ ఆపాలని ఆదేశించారు. అక్కడే ఉన్న భాజపా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు.. అధికారితో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత పోలీసు అధికారిని విధుల్లోంచి తొలగించాలని పెద్ద ఎత్తున నిరసన చేశారు. దాంతో తనను వేరే ప్రాంతానికి బదిలీ చేస్తారనే భయంతో.. వారికి క్షమాపణలు చెప్పారా పోలీసు అధికారి. పోలీస్ స్టేషన్లోనే రౌడీషీటర్‌తో కేకు కట్ చేయించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ అంశంపై చర్యలకు ఆదేశించారు ఉన్నతాధికారులు.