బరాత్‌లో కారుపైకి ఎక్కి స్టెప్పులేసిన పెళ్లి కూతురు.. వీడియో వైరల్ - వధువు పెళ్లి ఊరేగింపు
Bride Dancing at Wedding: బారాత్‌లో పెళ్లి కొడుకుని ఊరేగించడం ఆనవాయితీ. కానీ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో అందుకు భిన్నంగా పెళ్లి కూతురు ఊరేగింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వధువు భావన.. జిప్సీ కారుపై పెళ్లిమండపానికి చేరుకుని అందరినీ ఆకట్టుకుంది. దాదాపు కిలోమీటరు దూరం వరకు కొనసాగిన ఈ బారాత్‌లో కారు బానెట్‌పైకి ఎక్కి భావన స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.