రైల్వే ప్లాట్‌ఫామ్‌పై కరెన్సీ నోట్లు.. యాచకుడి విచిత్ర ప్రవర్తన - రైల్వే ప్లాట్‌ఫామ్‌పై కరెన్సీ నోట్లు
Beggar threw currency notes: మధ్యప్రదేశ్ నాగ్దా రైల్వే స్టేషన్లో ఓ యాచకుడు విచిత్రంగా ప్రవర్తించాడు. తన వద్ద ఉన్న కరెన్సీ నోట్లలను రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై చెల్లాచెదురుగా పడేశాడు. ఇది చూసి ఆశ్చర్యపోవడం ప్రయాణికుల వంతు అయింది. ప్లాట్‌ఫామ్‌పై నోట్లతో పాటు ఆస్తి దస్తావేజులు ఉండటం గమనార్హం. ఆ నోట్లను ఎవరూ ముట్టుకోలేదు. అయితే ఆ వృద్ధుడు ఎందుకు అలా చేశాడో తెలియలేదు. ఎవరో అన్న మాటలకు కోపంతో అతని వద్ద ఉన్న డబ్బులను విసిరేశాడని ఓ ప్రయాణికుడు చెప్పాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.