Viral Video: కలెక్టర్ ఇంట్లో ఎలుగుబంటి హల్చల్ - ఎలుగుబంటి హల్చల్ వీడియోలు
ఒడిశా నువాపాడా జిల్లా కలెక్టర్ నివాసంలోకి ఎలుగుబంటి ప్రవేశించింది. దీంతో అక్కడి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. భల్లూకాన్ని బయటకు పంపేందుకు తీవ్రంగా శ్రమించారు. సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఆహారం కోసం వెతుకుతూ కలెక్టర్ నివాస భవనంలోకి ఎలుగుబంటి ప్రవేశించిందని స్థానికులు తెలిపారు. కలెక్టర్ నివాసంలో ఎలుగుబంటి సంచరిస్తున్న ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Last Updated : Jul 15, 2021, 2:53 PM IST