రిసార్టులో ఎలుగుబంటి హల్చల్.. అర్ధరాత్రి సంచారం - జనావాసాల్లో ఎలుగుబంటి వీడియోలు
జనావాసాల్లో వన్యప్రాణుల సంచారం పెరుగుతోంది. పులులు, ఏనుగులతో పాటు ఎలుగుబంట్లు నివాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. తాజాగా రాజస్థాన్లో రణ్థంభోర్లో ఇటువంటి ఘటన జరిగింది. రణ్థంభోర్ నేషనల్ పార్క్ నుంచి వచ్చిన ఎలుగు ఓ రిసార్టులోకి ప్రవేశించింది. శనివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో వచ్చిన భల్లూకం.. దాదాపు 20 నుంచి 25 నిమిషాల పాటు అక్కడే సంచరించింది. అయితే భయంతో రిసార్ట్ సిబ్బంది ఎవరూ బయటకు రాలేదు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.