తెలంగాణ

telangana

ETV Bharat / videos

పట్టపగలే బ్యాంకు దోపిడీ.. భారీగా బంగారం, నగదు చోరీ - బ్యాంకు దోపిడీ పూణే

By

Published : Oct 21, 2021, 7:05 PM IST

మహారాష్ట్ర పుణెలో పట్టపగలే భారీ చోరీ (Bank robbery Pune) జరిగింది. పింపర్​ఖేడ్​లో ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలోకి తుపాకులతో ప్రవేశించిన ఐదుగురు దొంగలు.. ఉద్యోగులను బెదిరించి దోపిడీ (Pune robbery news) చేశారు. మేనేజర్​ను చంపుతామని బెదిరించారు. క్యాషియర్​కు తుపాకులు గురిపెట్టి.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు రూ. రెండు కోట్ల విలువైన బంగారం, రూ.31 లక్షల నగదు తీసుకొని కారులో పారిపోయారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు జిల్లాలోని అన్ని వైపులా రోడ్లను నిర్బంధించారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details