బురద గుంటలో ఏనుగు- జేసీబీ సాయంతో బయటకు! - బందీపూర్ టైగర్ రిజర్వ్
కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో బురద గుంటలో చిక్కుకుపోయిన ఓ ఆడ ఏనుగును పార్కు సిబ్బంది రక్షించారు. మోలెయూర్ పరిధిలో శనివారం(మే 15న) ఈ ఘటన చోటు చేసుకుంది. బురద గుంట నుంచి బయటకు వచ్చేందుకు ఏనుగు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంలో జాతీయ పార్కు సిబ్బంది రంగంలోకి దిగారు. జేసీబీ సాయంతో ఏనుగును బురద గుంట నుంచి పైకి తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బందీపూర్ టైగర్ రిజర్వ్ అధికారులు ట్విట్టర్‌లో ఉంచారు.