మహోత్తర ఘట్టానికి ముందు టపాసులు కాల్చి సంబరాలు - రామ మందిర్ భూమి పూజ
అయోధ్య భూమిపూజ వేళ దేశమంతటా పండగ వాతావరణం నెలకొంది. మధ్యప్రదేశ్ భోపాల్లో భాజపా పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. పంజాబ్ అమృత్సర్లోని ఆలయాల్లో భక్తులు దీపాలు వెలిగించి.. ఆనందం వ్యక్తం చేశారు. ఇక అయోధ్య ఎటు చూసినా విద్యుద్దీపాల వెలుగులతో కాంతులీనుతోంది. నగరమంతా అడుగడుగునా కోలాహలమే కనిపిస్తోంది.