ఆంజనేయుడిలా గాల్లో ఎగిరిన ఆటో డ్రైవర్! - Auto driver comes flying like Anjaneya video
కర్ణాటక బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ ఆంజనేయుడిలా గాల్లో ఎగిరాడు. ఎగురుకుంటూ వచ్చి మహిళను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన మహిళ చేతికి 52 కుట్లు వేశారు వైద్యులు. జులై 16న టీసీ పాల్య జంక్షన్ వద్ద ఓ ఆటో చక్రంలో కేబుల్ వైర్ ఇరుక్కుపోయింది. ఆగిన ఆటోను ముందుకు నెట్టడానకి ఆటో దిగాడు డ్రైవర్. ఆటో స్టార్ట్ అవ్వగానే.. కేబుల్ తీగను లాక్కొని ముందుకు కదిలింది. ఆ వైర్ కి ఇరువైపుల కాళ్లు పెట్టి నిలబడిన డ్రైవర్ వైర్‌తో పాటే పైకి ఎగిరాడు. వేగంగా ఎగిరొచ్చి మహిళను ఢీకొన్నాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో స్పష్టంగా రికార్డయ్యాయి.