అసోంలో వరద బీభత్సం.. ప్రజల ఇక్కట్లు - అసోం వరద న్యూస్
అసోంలో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని మించి ప్రవహించడం వల్ల 724 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 3 లక్షలమందిపై వరదల ప్రభావం పడింది. డిబ్రూగఢ్ జిల్లాలో పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. గ్రామాల్లోకి వరద నీరు రాకుండా.. సంచుల్లో ఇసుక నింపి, అడ్డుగా వేస్తున్నారు గ్రామస్థులు. ఇప్పటివరకు 40 మందికి పైగా మృతి చెందారు. పలువురి ఆచూకీ గల్లంతయింది. 14 జిల్లాల్లో వరదముంపు ఉన్నట్లు ప్రకటించారు అధికారులు.