యూపీ: 'పౌర' నిరసన హింసాత్మకం.. బాష్పవాయువు ప్రయోగం - CAA protests latest news
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్‌లో చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రాంపుర్ బంద్‌కు పిలుపునిచ్చిన క్రమంలో 144 సెక్షన్ ఆంక్షలను లెక్కచేయకుండా.. వీధుల్లోకి చేరిన 500 మంది ఆందోళనకారులు పోలీసులపై రాళ్ల దాడికి తెగబడ్డారు. వారిని అదుపు చేసేందుకు బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు భద్రతా సిబ్బంది. ఈ ఘటనలో 17మంది నిరనసకారులు సహా కొందరు పోలీసులూ గాయపడ్డారు.