డ్యూటీ కోసం ఇద్దరు మహిళల సాహసం - Rain effect on Odisha Anganwadies
ఒడిశాలో ఇద్దరు అంగన్వాడీ కార్యకర్తలు విధులకు హాజరవుతున్న తీరు ఆదర్శంగా నిలుస్తోంది. మల్కన్‌గిరి జిల్లా రాణిగూడకు చెందిన హేమలత, ప్రమీళ అనే ఇద్దరు మహిళలు విధులు నిర్వహించేందుకు పొరుగూరికి వెళ్లాలి. అయితే ఎడతెరపిలేని వర్షాల కారణంగా ఆ ప్రాంతంలో వరదలు పోటెత్తాయి. చుట్టుపక్కల గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. అయినప్పటికీ ఆ మహిళలు తమ ప్రాణాలను పణంగా పెట్టి.. మరో ఇద్దరి సాయంతో ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్న నదిని దాటి విధులకు హాజరయ్యారు.