ట్రాఫిక్ పోలీస్‌ను కారు బానెట్‌పై లాక్కెళ్లిన ఆకతాయి - దిల్లీలో కారు బీభత్సం
దేశ రాజధాని దిల్లీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. నగరంలోని ధౌలా కాన్ ప్రాంతంలో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినందుకు కారును ఆపేందుకు ప్రయత్నించాడు ట్రాఫిక్ పోలీసు. కానీ, కారును ఆపకుండా పోలీసుపైకి పోనిచ్చాడు డ్రైవర్. దాంతో ట్రాఫిక్ పోలీసు కారు బానెట్‌పైకి దూకగా.. అలాగే కొన్ని మీటర్ల వరకు ముందుకు ఈడ్చుకెళ్లాడు ఆకతాయి డ్రైవర్. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. కాంట్ పోలీస్ స్టేషన్లో డ్రైవర్ శుభమ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది.