'దేశవ్యాప్త ఎన్ఆర్సీపై ప్రస్తుతం చర్చ అనవసరం' - NRC AMIT SHAH
దేశవ్యాప్తంగా జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్సీ)ను అమలు చేసే అంశంపై ఎలాంటి చర్చ జరగలేదన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలను సమర్థించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అసలు దేశవ్యాప్త ఎన్ఆర్సీ అమలుపై కేబినెట్, పార్లమెంట్లో ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. అందువల్ల ఈ విషయంపై ప్రస్తుతం చర్చించాల్సిన అవసరమే లేదన్నారు షా.