సీన్ రివర్స్- వరుడి ఇంటికి గుర్రంపై వెళ్లిన పెళ్లికూతురు - వధువు గుర్రపు స్వారీ
పెళ్లిలో గుర్రంపై వరుడు వధువు ఇంటికి వెళ్లడం సంప్రదాయం. కానీ అందుకు భిన్నంగా ఓ వధువు స్వయంగా బరాత్‌లో గుర్రం మీద వరుడి ఇంటికి వెళ్లింది. దగ్గరుండి పెళ్లికుమారుడ్ని మండపానికి తీసుకొచ్చింది. ఈ ఘటన బిహార్‌లోని గయలో జరిగింది. ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తున్న అనుష్క గుహా.. వరుడే ఎందుకు గుర్రంపై సవారీ చేయాలి? వధువు ఎందుకు చేయకూడదన్న ఆలోచనే ఈ బరాత్‌లో పాల్గొనడానికి కారణమని తెలిపింది. వధువు సవారీ చేయడాన్ని చూసేందుకు స్థానికులంతా తరలివచ్చారు.