నీటి సంక్షోభం: తమిళనాడు ఆలయంలో మంత్రి పూజలు - TAMILNADU
తమిళనాడును గత కొద్ది రోజులుగా నీటి సంక్షోభం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. వర్షాల కోసం అక్కడ అధికార ఏఐఏడీఎంకే పార్టీ పెద్దలు ఆలయాల్లో యజ్ఞాలు, యాగాలు నిర్వహిస్తున్నారు. అరుల్మిగు గంగాదీశ్వరర్ ఆలయంలో రాష్ట్ర మంత్రి డి.జయకుమార్ పూజలు జరిపారు. రాష్ట్రంలో కరవు పరిస్థితిని అధిగమించేందుకు దేవునికి పూజలు చేస్తున్నామని తెలిపారాయన.